అందరికీ నమస్కారం,
ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఇక్కడ ఇలా తెలుగువాళ్ళందరం కలవడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు సాహితీ సమరాంగణ సార్వభౌములు "శ్రీ కృష్ణదేవరాయలు",
ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు "పాశ్చాత్యులు", తేట తెలుగు అన్నారు "కన్నడిగులు", సుందర భాష అన్నారు "తమిళులు". ఇలా చాలా మంది చాలావిధాలుగా తెలుగు భాషలోని గొప్పతనాన్ని, తెలుగువారిలోని ఔన్యత్యాన్ని కీర్తించారు.
ఎందరో మహానుభావులు తెలుగు భాషలోని మాధుర్యాన్ని తెలుగువారి యొక్క అభిమానాన్ని, అప్యాయతలని, సంప్రాదాయాలని వారి వ్యాసాలలో పొందుపరిచారు. ఆంతే కాదు మన యొక్క భాషలో, భావనలో శాస్త్రీయత అంతర్లీనమై ఉన్నది.
ఈ రోజులలో మనిషి తన జీవనం కోసం, తన అభివ్రుద్ది కోసం, ఎదుగుదల కోసం, విజ్ఞానాన్ని పెంచుకోవడం కోసం ఈ ప్రపంచంలో ఉన్న దేశాలు అన్నీ తిరుగుతున్నాడు. ఆఖరికి ఈ విషయంలో చంద్ర మండలంలో కుడా
తన జీవనం సాగించేదానికి బీజం వేసాడు. ఇదే పద్దతిలో మన తెలుగువారు కూడా ప్రపంచంలో వివిద దేశాలలో జీవనం సాగిస్తూ ఆయా దేశాలలో స్తిరపడుతున్నారు. అక్కడ ఎంత స్తిరపడినా మన తెలుగువాళ్ళు మన సంస్క్రుతిని మరచిపోకుండా, సంప్రదాయాలను గౌరవిస్తూ, వాటిని కాపాడడం కోసం, మన ఔన్యత్యాన్ని ఆయా దేశాలలో చాటి చెప్పడానికి అసోసియేషన్లు స్తాపిస్థూ, వెనక వచ్హే తరానికి చేయూతని ఇవ్వగలగుతున్నారు.
మన తెలుగు వారు మన సంస్కృతిని మరిచి పోకుండా ఉండేందుకు, మన భావి తరాలకు మన సంప్రదాయాలను అందించడం కోసం, మన తెలుగు ఔన్నత్యాన్ని నార్వేలో చాటి చెప్పాలన్న ప్రధాన ఉద్దేశంతో శ్రీ దుర్ముఖి నామ సంవత్సర సుభ ముహూర్తాన (08 ఏప్రిల్ 2016) నార్వే తెలుగు అసోసియేషన్ ను ప్రారంభించడం జరిగింది.
నార్వే తెలుగు సంఘం యొక్క మరొక ప్రధాన ఉద్దేశ్యం నార్వే వచ్చే తెలుగు వారికి ఒక సమాచార కేంద్రం లాగ ప్రయోజనం చేకూరుస్తూ, నార్వే సమాజం లో కలిసి పోవడానికి ఉపయోగ పడాలని ఆశిస్తూ రూపకల్పన చేయడం జరిగింది.
నార్వే లో తెలుగు సంస్కృతీ ని వికసింప చేయాలనుకునే ప్రతీ తెలుగు వారికి ఇదే మా ఆహ్వానం.
మీ నిరంతర మద్దతు, మార్గదర్శకత్వం మరియు సలహాలతో మా ఈ చిన్న ప్రయత్నం పలకాలి భావితరాలకు నాంది.
అలాగే మీరు ఎవరైనా నార్వే తెలుగు సంఘం అభివృద్ది లో భాగస్వాములు కావాలి అనుకునే వారు సంప్రదించండి.
nta@norwayteluguassociation.com
రండి..కదిలి రండి...కలసి రండి..ఉప్పెనలా ఉరికి రండి...
★★★ తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది ★★★